KTR - Mallareddy: ‘పాలమ్మిన.. పూలమ్మిన’.. కేటీఆర్‌ నోట మల్లారెడ్డి డైలాగ్‌!

మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఎంత సరదాగా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన మాటలకు ఫన్నీగా సమాధానాలిస్తూ మంత్రి కేటీఆర్‌ కూడా కాసేపు నవ్వులు పూయించారు. మేడ్చల్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన కలుషిత వ్యర్ధజలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మల్లారెడ్డి ప్రస్తావించారు. ఆయనకు సమాధానమిస్తూ.. ఇటీవల బాగా ట్రెండింగ్‌గా మారిన ‘పాలమ్మిన.. పూలమ్మిన..’ అనే మల్లారెడ్డి డైలాగ్‌ను చెప్పి కేటీఆర్‌ అందరినీ నవ్వించారు. 

Published : 15 Apr 2023 16:00 IST

Tags :

మరిన్ని