PMGKAY: ఉచిత రేషన్‌ మరో ఐదేళ్లు పొడిగింపు.. కేంద్ర కేబినెట్ ఆమోదం

మంగళవారం రాత్రి జరిగిన కేబినేట్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKAY) కింద అందిస్తున్న ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు పొడిగించేందుకు పచ్చజెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్ర, సాంకేతిక ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

Published : 29 Nov 2023 20:58 IST

Tags :

మరిన్ని