Bharateeyudu 2: తాతా వస్తాడే తాట తీసి పోతాడే.. ‘భారతీయుడు 2’ కొత్త పాట

‘భారతీయుడు 2’లోని మరో పాట తాజాగా విడుదలైంది. కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన చిత్రమిది.

Published : 07 Jun 2024 18:06 IST

కమల్ హాసన్‌ (Kamal Haasan) హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది. కాజల్‌ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, ప్రియాభవానీ శంకర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ‘తాతా వస్తాడే’ (Thatha Vasthaade) పాటను సోషల్‌ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేసింది. హీరో పాత్రను హైలైట్‌ చేసే ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌లో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ తమ డ్యాన్స్‌తో అలరించారు.

Tags :

మరిన్ని