USB charger scam: బహిరంగ ప్రదేశాల్లో యూఎస్‌బీతో ఛార్జింగ్‌ వద్దు: కేంద్రం

బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్ల సాయంతో మొబైల్‌ ఫోన్ల ఛార్జింగ్‌ చేయొద్దని కేంద్రం తరఫున ‘కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరిక జారీ చేసింది. బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన యూఎస్‌బీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఆసరాగా చేసుకొని కొందరు నేరగాళ్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి, లేదా వారి పరికరాల్లో మాల్వేర్‌ను జొప్పించడానికి ఛార్జింగ్‌ పోర్ట్స్‌ను ఉపయోగించుకుంటున్నారు.

Updated : 31 Mar 2024 13:21 IST

Tags :

మరిన్ని