Manthani: ఉప్పొంగిన మానేరు.. ప్రవాహంలో చిక్కుకున్న 12 మంది ఇసుక క్వారీ కార్మికులు

పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) నియోజకవర్గంలో గోదావరి, మానేరు, తీగల వాగు ,ఆరెవాగులు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మానేరు వాగు ఉప్పొంగడంతో మంథని మండలం గోపాల్‌పూర్ ఇసుక క్వారీలో 12 మంది చిక్కుకుపోయారు. వారిలో ఒకరు గల్లంతయినట్లు స్థానికుల సమాచారం. వారిని సురక్షితంగా తీసుకురావడానికి.. సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రెవెన్యూ,పోలీస్ అధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మల్హర్ మండలంలోని ఆరెవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో కొయ్యూరు- తాడిచెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడిచెర్ల రెవెన్యూ కార్యాలయం చుట్టూ వరద నీరు చేరింది. 

Updated : 27 Jul 2023 15:47 IST

Tags :

మరిన్ని