Cyclone Michaung: అల్లూరి జిల్లాలో పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం మన్యంలో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.  భూపతిపాలెం జలాశయం నుంచి ఆరు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. దీంతో సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించి రంప వంతెనను ముంచెత్తింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు పరిసరాల్లో ఇ.కొత్తూరు వద్ద వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. పరదాని పుట్టు వంతెనను వరద ముంచెత్తడంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ రహదారి మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.

Published : 06 Dec 2023 15:22 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు