ఏపీలో కొనసాగుతున్న వర్షాలు.. అమలాపురం, తునిలో లోతట్టు ప్రాంతాలు జలమయం

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమలాపురంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ జిల్లా తునిలో వర్షాలు కురుస్తున్నాయి. కోటనందురు మండలం కాకరాపల్లి వద్ద బొండు గడ్డ వాగు పొంగడంతో తుని-నర్సీపట్నం ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు ఆగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో తుపాను తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.

Updated : 06 Dec 2023 14:45 IST
Tags :

మరిన్ని