Gudivada: కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Updated : 07 Jun 2024 17:35 IST

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని.. మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగుదేశం యువత ఆందోళనకు దిగారు. కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు. ఫ్యాన్‌కు తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తెలుగు యువతను పోలీసులు అడ్డుకున్నారు. నాని ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Tags :

మరిన్ని