school bus: స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు అత్యంత కీలకం: హైదరాబాద్‌ జేటీసీ

పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు అత్యంత కీలకమైనవి. మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కానీ, ఇప్పటివరకు రవాణాశాఖ అధికారులు సగం బస్సులకు కూడా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించలేదు. వారం రోజుల్లో అన్ని బస్సులకు పరీక్షలు పూర్తిచేస్తామని హైదరాబాద్ JTC రమేశ్ తెలిపారు.

Updated : 30 May 2024 17:57 IST

పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు అత్యంత కీలకమైనవి. మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కానీ, ఇప్పటివరకు రవాణాశాఖ అధికారులు సగం బస్సులకు కూడా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించలేదు. వారం రోజుల్లో అన్ని బస్సులకు పరీక్షలు పూర్తిచేస్తామని హైదరాబాద్ JTC రమేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23,250 వరకు బడి బస్సులు ఉండగా.. 8,500బస్సులకు మాత్రమే పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 1290 పాఠశాలల బస్సులు ఉండగా.. 600 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తైనట్టు వివరించారు. సుమారు 700 బస్సుల వరకు ఫిట్‌నెస్‌ పూర్తిచేసుకోవాల్సి ఉందన్నారు. వారం రోజుల్లో అన్ని బస్సులకు పరీక్షలు పూర్తిచేస్తామని చెప్పారు.

Tags :

మరిన్ని