12 ఏళ్లలో భార‌త్‌లో 90 రెట్లు పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు: ఆర్‌బీఐ గవర్నర్‌

గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్ లైన్ చెల్లింపుల్లో దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ముంబయిలోని ఆర్బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 162 కోట్ల రిటైల్ ఆన్ లైన్ పేమెంట్స్ జరగ్గా..., 2023-24 నాటికి అది 14 వేల 726 కోట్లకు పెరిగిందని చెప్పారు.

Published : 05 Mar 2024 13:55 IST

Tags :

మరిన్ని