Kejriwal: పాఠశాలల నిర్మాణం, ఉద్యోగ కల్పనపై మోదీ మాట్లాడరు: కేజ్రీవాల్

భారత్ నియంతృత్వ పాలనలో ఉందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని లూథియానాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 28 May 2024 18:58 IST

భారత్ నియంతృత్వ పాలనలో ఉందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని లూథియానాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీకి గత పదేళ్లలో చేశామని చెప్పుకునేందుకు ఏమీలేదని వివరించారు. పదేళ్లు గడిచినా పాఠశాలల నిర్మాణం, ఉద్యోగ కల్పనపై మోదీ మాట్లాడలేకపోతున్నారన్న కేజ్రీవాల్.. కేవలం మంగళసూత్రం, మాంసం, పాకిస్థాన్‌ గురించే మోదీ ప్రసంగిస్తారని ధ్వజమెత్తారు. భాజపా విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని