Indiana Jones: 14ఏళ్ల తర్వాత ‘ఇండియానా జోన్స్‌..’ కొత్త చిత్రం వచ్చేస్తోంది!

యాక్షన్‌, అడ్వెంచర్‌ సినీ ప్రియులను ఎంతగానో అలరించాయి ‘ఇండియానా జోన్స్‌’ చిత్రాలు. నిధి వేట, అపురూప వస్తువులను అన్వేషించే కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ జానర్‌లో వస్తున్న మరో కొత్త చిత్రం ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’. ఇండియానా జోన్స్‌గా హారిసన్‌ ఫోర్డ్‌ మరోసారి అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. జూన్‌ 30, 2023న ఈ కొత్త చిత్రం థియేటర్‌లలో అలరించనుంది. చివరిగా 2008లో ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ క్రిస్టల్‌ స్కల్‌’ వచ్చింది. దాదాపు 14ఏళ్ల తర్వాత కొత్త చిత్రం రాబోతోంది. ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లో తాజా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated : 02 Dec 2022 19:42 IST
Tags :

మరిన్ని