AP News: జగన్‌ పాలనలో కళ తప్పిన పారిశ్రామిక రంగం

జగన్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పారిశ్రామికవాడల కళ తప్పింది.

Updated : 24 Apr 2024 14:50 IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పారిశ్రామికంగా ఏం చేశారనగానే హెచ్‌సీఎల్‌ నుంచి మేధా టవర్స్, ఆటోనగర్‌లో సాఫ్ట్‌వేర్ టవర్స్ వరకూ అనేకం గుర్తొస్తాయి. మల్లవల్లి, వీరపనేనిగూడెంలో భారీ పరిశ్రమలకు వందల ఎకరాలు కేటాయించారు. కొండలు, గుట్టలను చదునుచేసి పారిశ్రామికవాడలుగా మార్చారు. కానీ, జగన్‌ అధికారంలోకి రాగానే ఆ పారిశ్రామికవాడల కళ తప్పింది. గత సర్కార్  పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన భూముల ధరలను అమాంతం పెంచేసి.. వారిని గుల్లచేయడం ఆరంభించారు. కొందరు న్యాయస్థానాల్లో పోరాడుతుంటే మరికొందరు ఈ తలనొప్పులన్నీ ఎందుకని వదిలేసి వెళ్లిపోయారు. 

Tags :

మరిన్ని