Iran: హిజాబ్‌ నిరసనలతో దిగొచ్చిన ఇరాన్‌ సర్కారు.. నైతిక పోలీసు వ్యవస్థ రద్దు!

హిజాబ్‌కు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగిన వేళ.. ఇరాన్ సర్కారు ఎట్టకేలకు దిగివచ్చింది. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హిజాబ్ చట్టాల అమలు కోసం 2005లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హిజాబ్ సరిగా ధరించలేదని మాసా అమీని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రెండు నెలలకుపైగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్  అట్టుడుకింది. చివరికి నైతిక పోలీసు వ్యవస్థనే ఇరాన్ రద్దు చేయాల్సి వచ్చింది.

Published : 04 Dec 2022 19:01 IST
Tags :

మరిన్ని