మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై 4 లక్షల ఫిర్యాదులు వస్తే చర్యలేవి?: నాదెండ్ల మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం జగన్‌ తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ 14400కు 8.03లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులు, వారి పేషీలపై 2.06 లక్షలు, ఎమ్మెల్యేల అవినీతిపై 4.39లక్షల ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు?’ అని నాదెండ్ల ప్రశ్నించారు.

Updated : 29 Mar 2024 19:56 IST

Tags :

మరిన్ని