KA Paul: నన్నెందుకు ఆహ్వానించలేదు?.. సచివాలయం మెట్లపై బైఠాయించిన కేఏ పాల్‌

ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు. తొలుత సచివాలయం ప్రధాన గేట్ వద్ద ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే, సీఈవో ముఖేశ్‌ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, ఇప్పుడు కలవలేరని సిబ్బంది పాల్‌కు తెలిపారు. దీంతో ఆయన ఐదో బ్లాక్ మెట్ల వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. 

Published : 07 Mar 2024 18:57 IST

Tags :

మరిన్ని