AP news: రోడ్లులేక.. గిరిజనులకు తప్పని డోలీ మోతలు ..

గత పాలకుల నిర్లక్ష్యం గిరిజనుల పాలిట శాపంగా మారింది. కొండ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పటికీ డోలీ మోతలు, నడక ప్రయాణాలు, ప్రమాదాలు తప్పడం లేదు.

Published : 07 Jun 2024 13:37 IST

గత పాలకుల నిర్లక్ష్యం గిరిజనుల పాలిట శాపంగా మారింది. కొండ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పటికీ డోలీ మోతలు, నడక ప్రయాణాలు, ప్రమాదాలు తప్పడం లేదు. తాజాగా కొండ ప్రాంతాల్లోని ప్రమాదకర రహదారిపై ప్రయాణిస్తుండగా ఓ బైక్ జారిపడింది. దీంతో పశువు తోక పట్టుకుని బైక్‌ను తోసుకుపోయే పరిస్థితి నెలకొంది. కేంద్రం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులపై మట్టి, రాళ్లు అలాగే వదిలేయడంతో చాలా చోట్ల అధ్వానంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని