Leopard: పెద్దపల్లిలో చిరుత సంచారం!

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా స్థానికులు గుర్తించారు.

Updated : 06 Jun 2024 13:09 IST

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో రైలు గేటు పడిన తర్వాత ప్రజలు ఎవరూ లేకపోవడంతో రహదారిపై నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి చిరుత పులి వెళ్లినట్లు కెమెరాలో నిక్షిప్తమైంది. పెద్దపల్లి అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వగా.. చిరుతపులి సంచరించిన ప్రాంతంలో సిబ్బంది.. పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు

Tags :

మరిన్ని