Mohamed Muizzu: భారత్‌ విషయంలో స్వరం మార్చిన మహ్మద్ ముయిజ్జు!

మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) భిన్న స్వరం వినిపించారు. భారతదేశం (India) తమకు ఎప్పటికీ సన్నిహిత మిత్రుడిగా కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ఆ దేశం నుంచి రుణవిముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు బకాయిపడింది. దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని ద్వీప దేశం ప్రాధేయపడుతోంది.

Published : 23 Mar 2024 14:10 IST

Tags :

మరిన్ని