Ap News: అలల ఉద్ధృతికి కొట్టుకుపోయిన యువకుడు.. తప్పిన ప్రాణాపాయం!

పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో అలల ఉద్ధృతికి కొట్టుకుపోయిన యువకుడికి ప్రాణాపాయం తప్పింది.

Published : 21 May 2024 15:20 IST

పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో అలల ఉద్ధృతికి కొట్టుకుపోయిన యువకుడికి ప్రాణాపాయం తప్పింది. పెనుగొండకు చెందిన పలువురు యువకులు క్యాటరింగ్ నిమిత్తం నరసాపురం వెళ్లారు. పనులు పూర్తి చేసుకుని అందరూ పేరుపాలెం బీచ్‌కు వెళ్లి సముద్రంలో స్నానాలకు దిగారు. అందులో ఒక యువకుడు అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకెళ్లాడు. దీంతో స్నేహితులు ఏం చేయాలో పాలుపోక కంగారు పడ్డారు. కాసేపటికి కెరటాల తాకిడికి గౌతమ్ ఒడ్డుకు కొట్టుకురావడంతో ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే అత్యవసర వాహనంలో నరసాపురం ఆస్పత్రికి తరలించారు. 

Tags :

మరిన్ని