Rajanarasimha: గ్యారెంటీలన్నీ అమలు చేస్తాం.. ప్రతిపక్షానికి సహనం అవసరం: మంత్రి దామోదర రాజనర్సింహ

భారాస నేతలకు సవాళ్లు విసరడం తప్ప మరో పని ఉండదని మంత్రి దామోదర రాజనర్సింహ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షానికి సహనం, ఓపిక ఉండాలన్నారు.

Published : 24 Apr 2024 17:19 IST

భారాస నేతలకు సవాళ్లు విసరడం తప్ప మరో పని ఉండదని మంత్రి దామోదర రాజనర్సింహ ఎద్దేవా చేశారు. జహీరాబాద్ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి మంత్రి దామోదర్, షబ్బీర్ అలీ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారాస నేతలకు జీవితాంతం అబద్ధాలు మాట్లాడటం తప్ప ఏమీ పని ఉండదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి సహనం, ఓపిక ఉండాలన్నారు. ఇచ్చిన గ్యారెంటీలు తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

Tags :

మరిన్ని