KTR: ఫ్లైఓవర్‌ కింద బాస్కెట్‌ బాల్ కోర్టు.. ఐడియా అదిరిందన్న మంత్రి కేటీఆర్‌!

సాధారణంగా పైవంతెన(Fly Over)ల కింత మొక్కలు పెంచడం, వాహనాల పార్కింగ్‌ సదుపాయాలు కల్పించడం మనం చూస్తుంటాం. అయితే నవీ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కాస్త భిన్నంగా ఆలోచించారు. ఫ్లైఓవర్‌ కింద ఖాళీ స్థలంలో బాస్కెట్‌ బాల్(Basket Ball), బ్యాడ్మింటన్‌(Badminton) కోర్టు ఏర్పాటు చేశారు. దీనిపై నగర ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఆలోచన బాగుందంటూ మంత్రి కేటీఆర్‌(KTR) సైతం ఆ వీడియోను షేర్‌ చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఏర్పాటు చేద్దామంటూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ట్యాగ్‌ చేశారు.  

Updated : 28 Mar 2023 12:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు