Ponnam: మాజీ సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారు?: మంత్రి పొన్నం ప్రభాకర్

నాలుగు నెలలుగా మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరవు కాంగ్రెస్ తోనే వచ్చిందని, 200 మంది రైతులు చనిపోయారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. కరవుకు, రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు.

Published : 01 Apr 2024 17:44 IST

Tags :

మరిన్ని