కోమటిరెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: మంత్రి ఉత్తమ్‌

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 24 Apr 2024 17:05 IST

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttamkumar reddy) తెలిపారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్‌ రెడ్డి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణకు భాజపా చేసిందేమీ లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారాస మనుగడ ప్రశ్నార్థకమని విమర్శించారు.

Tags :

మరిన్ని