Eatala Rajender: అధ్యక్షా.. టిఫిన్ చేసేందుకు మాకు గది కూడా లేదు!: ఈటల రాజేందర్‌

అసెంబ్లీకి వచ్చిన తమకు టిఫిన్ చేసేందుకు కూడా సదుపాయం లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేకు ఇది అవమానమని అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈటల మాటలను మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. బడ్జెట్‌పై చర్చించే సమయంలో సదుపాయాలపై మాట్లాడటం తగదని చెప్పారు. అలాంటి అంశాలను సభాపతి కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేయాలని సూచించారు. మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు సైతం జోక్యం చేసుకొని ఈటలకు శాసనసభ సంప్రదాయాలను వివరించారు. 

Updated : 08 Feb 2023 13:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు