నూడుల్స్‌ ప్యాకెట్‌లో రూ.6.44 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు అక్రమ రవాణా..!

అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన వజ్రాలు, 7 కిలోల బంగారాన్ని ముంబయి కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది.

Published : 23 Apr 2024 16:40 IST

ముంబయి నుంచి బ్యాంకాక్ వెళుతున్న ఓ భారతీయుడు.. నూడుల్స్ ప్యాకెట్‌లో వజ్రాలను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. కొలంబో నుంచి ముంబయికి వచ్చిన మరో విదేశీయుడు తన లోదుస్తులు, మాస్కులలో బంగారు కడ్డీలను తరలించినట్లు అధికారులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.4.44 కోట్ల విలువైన దాదాపు 7కిలోల బంగారం, రూ.2 కోట్లకు పైగా విలువ చేసే వజ్రాలు ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

మరిన్ని