సిరివెన్నెల లేని సినిమా ప్రపంచంలో అనాథనయ్యాను: దర్శకుడు కృష్ణవంశీ

సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని సినిమా ప్రపంచంలో తాను అనాథనయ్యానని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 18 May 2024 15:49 IST

సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని సినిమా ప్రపంచంలో తాను అనాథనయ్యానని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (KrishnaVamsi) భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల కొత్త సినిమా ప్రారంభిద్దామనుకున్న తనకు పాటల విషయంలో సిరివెన్నెల (Sirivennela) లోటు కనిపించిందని కృష్ణవంశీ కన్నీటి పర్యంతమయ్యారు. సిరివెన్నెలకు నివాళిగా ‘శృతిలయ ఫౌండేషన్’ అమెరికాకు చెందిన శ్రీరామ్ చెరువు  ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకులు పార్థసారథి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో అగ్ర నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. మే 19 నుంచి ప్రతి ఆదివారం ఉ.9.30 గంటలకు ఈటీవీలో 'నా ఉచ్ఛ్వాసం కవనం' ప్రసారం కానుంది. 

Tags :

మరిన్ని