Taraka Ratna: నిలకడగానే తారకరత్న ఆరోగ్యం: బుచ్చయ్య చౌదరి

యువగళం పాదయాత్రలో సినీనటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు అనంతరం పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్‌తోపాటు తారకరత్న వెంట నడిచారు. లక్ష్మిపురంలోని మసీదులో ప్రార్ధనల అనంతరం బయటకు వచ్చిన తర్వాత... కార్యకర్తల తోపులాటలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న బాలకృష్ణ... వైద్యులతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులతో చర్చించారు. తారకరత్నకు వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు.

Published : 27 Jan 2023 15:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు