Hyderabad: విద్యార్థినిని పరీక్షాకేంద్రంలో దింపి సాయం చేసిన సీఐ

పరీక్షకు ఆలస్యమవుతున్న ఓ విద్యార్థినికి నారాయణగూడ సీఐ చంద్రశేఖర్‌ సాయం చేశారు. పోలీసు వాహనంలో విద్యార్థినిని పరీక్ష కేంద్రంలో దింపారు.

Published : 21 Apr 2024 12:34 IST

పరీక్షకు ఆలస్యమవుతున్న ఓ విద్యార్థినికి నారాయణగూడ సీఐ చంద్రశేఖర్‌ సాయం చేశారు. పోలీసు వాహనంలో విద్యార్థినిని పరీక్ష కేంద్రంలో దింపారు. టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష నిమిత్తం అంబర్‌పేటకు వెళ్లాల్సిన విద్యార్థిని బైక్‌ పాడవడంతో ఆటో ఎక్కారు. డ్రైవర్‌కు అడ్రస్‌ తెలియక నారాయణగూడ గురునానక్‌ పాఠశాలకు తీసుకువెళ్లాడు. పరీక్షకు కేవలం 15 నిమిషాల సమయమే ఉండటంతో అక్కడే ఉన్న పోలీస్ వాహనంలో విద్యార్థినిని.. సీఐ పరీక్షాకేంద్రానికి తీసుకెళ్లి ఉదారత చాటుకున్నారు.

Tags :

మరిన్ని