వైకాపా అరాచకాలు చెప్పాలంటే తెలుగులో అక్షరాలు సరిపోవు: సాధినేని యామిని

వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని.. వారి సంక్షేమాన్ని సీఎం జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు మండిపడ్డారు.

Published : 20 Apr 2024 17:36 IST

వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని.. వారి సంక్షేమాన్ని సీఎం జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు మండిపడ్డారు. జగన్ పై గులకరాయి వేసినందుకు వైకాపా నేతలకు కడుపు మండితే.. మహిళలతో పాటు అన్ని వర్గాల వారికి ఐదేళ్లుగా నరకం చూపిస్తున్న ప్రభుత్వంపై వారికి ఎంత మండాలని జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రశ్నించారు. మహిళల కష్టాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వైకాపా జేబులు నింపుకొంటోందని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ విమర్శించారు.

Tags :

మరిన్ని