Amaravati: సీఆర్డీఏ దిద్దుబాటు చర్యలు.. పూర్వవైభవం దిశగా అమరావతి అడుగులు

వైకాపా అధికారం నుంచి దిగిపోగానే.. అమరావతికి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి.

Published : 06 Jun 2024 17:09 IST

వైకాపా (YSRCP) అధికారం నుంచి దిగిపోగానే.. అమరావతి (Amaravati)కి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఐదేళ్లూ అమరావతి వైపు కనీసం కన్నెత్తి చూడని సీఆర్డీఏ అధికారుల్లో కూటమి విజయంతో కదలిక వచ్చింది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పిచ్చిమొక్కల్ని తొలగిస్తున్నారు. రాజధాని అభివృద్ధి గురించి ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోని అధికారుల తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు రైతులు. ప్రభుత్వం మారగానే ఉద్యోగాలు కాపాడుకునేందుకు సీఆర్డీఏ (CRDA) అధికారులు పనులు చేయిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

Tags :

మరిన్ని