CM Jagan: సీఎం జగన్‌ వస్తున్నారని.. రాత్రికి రాత్రే రోడ్డేశారు..!

సీఎం ఆదివారం విశాఖ నగరంలో యాత్ర కొనసాగించనున్నారు. అనకాపల్లి జిల్లా నుంచి విశాఖ చేరుకునే మార్గంలో.. వేపగుంట-పినగాడి రోడ్డు గతుకులమయంగా ఉంది. దీన్ని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు.. రాత్రికిరాత్రి హడావుడిగా బాగుచేయించారు. 

Published : 21 Apr 2024 15:06 IST

    గుంతలమయమైన ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ.. వాహనదారులు, ప్రయాణికులు ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్నో ప్రమాదాలకు గురయ్యారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం మరమ్మతులు చేయలేదు. అలాంటి రోడ్డును.. ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమం కోసం సీఎం జగన్ వస్తున్నారని.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా రాత్రికి రాత్రే మరమ్మతులు చేశారు. సీఎం ఆదివారం విశాఖ నగరంలో యాత్ర కొనసాగించనున్నారు. అనకాపల్లి జిల్లా నుంచి విశాఖ చేరుకునే మార్గంలో.. వేపగుంట-పినగాడి రోడ్డు గతుకులమయంగా ఉంది. దీన్ని ఇన్నాళ్లూ పట్టించుకోని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు.. రాత్రికిరాత్రి హడావుడిగా బాగుచేయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు