AP News: పింఛనుదారుల పడిగాపులు.. మండుటెండలో గంటల తరబడి నిరీక్షణ

ఏపీవ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారులు పడిగాపులు కాస్తున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారులు సరిగా సమాచారం ఇవ్వకపోవడం, వైకాపా నేతల దుష్ప్రచారంతో ఉదయమే అక్కడికి చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు.. మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వారికి నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు.

Published : 03 Apr 2024 15:01 IST

Tags :

మరిన్ని