ఫోన్ ట్యాపింగ్‌ కేసులో.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు!

రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్ (PhoneTapping)వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్ఐబీలో సీఐగా పని చేశారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. నిన్న రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారు. 

Published : 28 Mar 2024 20:12 IST
Tags :

మరిన్ని