సీఎం జగన్‌ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం.. సామాన్య ప్రజలు అవస్థలు

కాకినాడ జిల్లాలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

Published : 19 Apr 2024 13:44 IST

కాకినాడ జిల్లాలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పర్యటన సందర్భంగా... పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ.. సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా.. ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుతో ఆస్పత్రులకు వెళ్లే రోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉంచుతున్నారు. .

Tags :

మరిన్ని