Revanth Reddy: రేవంత్‌రెడ్డి నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని (Revanth reddy) కాంగ్రెస్‌ (Congress) శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 44లో నివాసముంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44ఎ రోడ్డులోనే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 

Published : 06 Dec 2023 12:18 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు