డాక్టర్ కావాలన్న లక్ష్యంతోనే కష్టపడి చదివాను: ఈఏపీసెట్ మొదటి ర్యాంక్‌ ప్రణీత

ఈఏపీసెట్‌లో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ప్రణీత అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి ర్యాంక్ సాధించారు.

Published : 18 May 2024 19:00 IST

ఈఏపీసెట్‌ (EAPSET)లో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ప్రణీత అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి ర్యాంక్ సాధించారు. మదనపల్లిలోని సొసైటీ కాలనీలో నివాసముంటున్న హోమియో డాక్టర్ శ్రీకర్, సైన్స్ ఉపాధ్యాయురాలు కల్యాణిల చిన్న కుమార్తె ప్రణీత. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న లక్ష్యంతోనే పట్టుదలతో చదువుతున్నట్లు ప్రణీత తెలిపారు. ఈఏపీసెట్ లో మొదటి ర్యాంక్ సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని