లోకోపైలట్‌ లేకుండా గూడ్స్ రైలు పరుగులు.. ఆరుగురు సిబ్బంది సస్పెన్షన్‌

లోకోపైలట్‌ లేకుండా గూడ్స్ రైలు జమ్ముకశ్మీర్‌లోని కథువా నుంచి పంజాబ్‌లోని ఉచ్చిబసి స్టేషన్ వరకు దాదాపు 70 కిలోమీటర్లు  ప్రయాణించిన ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లోకోపైలట్‌తో పాటు కథువా స్టేషన్ మాస్టర్ విధుల పట్ల పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. లోకోపైలెట్, స్టేషన్ మాస్టర్‌తో పాటు ఘటనతో సంబంధమున్న పలువురి వాంగ్మూలాలను దర్యాప్తు బృందం నమోదు చేసి నివేదిక రూపొందించింది.

Published : 27 Feb 2024 19:21 IST
Tags :

మరిన్ని