Crime News: సైకో సదానందం.. కుమార్తెను నరికి చంపిన తండ్రి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. 11 ఏళ్ల తన కుమార్తెను.. తండ్రి గుండ్ల సదానందం గొడ్డలితో నరికి చంపాడు. మరొకరిపై దాడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బట్టుపల్లిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామం నుంచి పోలీస్ వాహనం కదలకుండా స్థానికుడు అడ్డుకున్నారు. దారికి అడ్డంగా కట్టెలు వేసి సదానందను పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితునిపై కారంపొడితో దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొవడం కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు సదానందం గతంలో అతని భార్యను చంపిన కేసులో జైలు జీవితం గడిపి వచ్చాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Published : 11 May 2023 18:48 IST

Tags :

మరిన్ని