YSRCP: వైకాపా భూ దోపిడీకి రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సాయం..!

పేదల నుంచి కొట్టేసిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందారులు, ఉన్నతాధికారుల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.

Published : 07 Jun 2024 13:13 IST

పేదల నుంచి కొట్టేసిన ఎసైన్డ్ భూములను వైకాపా (YSRCP) పెత్తందారులు, ఉన్నతాధికారుల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ భూములు నిషిద్ధ జాబితా నుంచి తొలగించినట్లు వెబ్ ల్యాండ్‌లో నమోదు కాకున్నా, రిజిస్ట్రేషన్ ఆపొద్దంటూ ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రామకృష్ణ ఆదేశాలు జారీచేసి, అక్రమాలకు చేయూతనిచ్చారు. గత జనవరిలో జారీచేసిన ఈ ఉత్తర్వుల్లో అదే నెల 20వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్లకు అవసరమైన ప్రక్రియ పూర్తికావాలని షరతు కూడా విధించారు.

Tags :

మరిన్ని