Bapatla: సీఎం జగన్‌ పర్యటన.. 20 కి.మీ మేర జాతీయ రహదారిపై ఆంక్షలు

సీఎం జగన్‌ (CM Jagan) పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా (Bapatla News)లోని 216వ నంబర్‌ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. రహదారిని ఆధీనంలోకి తీసుకొని.. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల నుంచి కర్లపాలెం మండలం బుద్దాం వరకు 20 కి.మీ. మేర రాకపోకలు నిషేధించారు. దీంతో చుట్టుపక్కల 10 గ్రామాల వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుండటంతో తెల్లవారుజాము నుంచే హైవే మూసివేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి హెలిప్యాడ్‌ను కూడా మరుప్రోలువారిపాలెం వద్ద హైవే పైనే ఏర్పాటు చేయడం గమనార్హం.

Published : 08 Dec 2023 13:45 IST
Tags :

మరిన్ని