Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో రష్యా ప్రభుత్వ ప్రతినిధుల భేటీ

మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వారితో చిరంజీవి భేటీ అయ్యారు. 

Published : 18 Apr 2024 20:16 IST

మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వారితో చిరంజీవి భేటీ అయ్యారు. ఇరు దేశాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, సృజనాత్మ రంగాల్లో ప్రోత్సాహకాలపై పరస్పరం చర్చించుకున్నారు. రష్యాలో తెలుగు సినిమా చిత్రీకరణలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మక సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు జులియా గోలుబెవా, ఎకటెరినా జాడే  చిరంజీవికి వివరించారు. మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన అంశాల పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని