Secunderabad: భోజనంలో బొద్దింక వచ్చిందని.. పీజీ కళాశాల విద్యార్థుల ఆందోళన

సికింద్రాబాద్ పీజీ కళాశాల వసతి గృహం విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. గురువారం రాత్రి భోజనంలో బొద్దింకలు రావడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. వంట సామాగ్రితో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. గతంలో పలుమార్లు తినే ఆహారంలో పురుగులు, రాళ్లు రావడంతో కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలేని ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

Published : 29 Mar 2024 12:57 IST
Tags :

మరిన్ని