నటుడు చందు ఆత్మహత్యపై భార్య శిల్ప స్పందన

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated : 18 May 2024 14:20 IST

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్రినయిని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని చెప్పారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ప్రస్తుతం తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని ఆమె వెల్లడించారు. వివాహం జరిగిన తర్వాత వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయని, ప్రస్తుతం తమ పరిస్థితి కూడా అలాగే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని