AP Election Violence: పోలింగ్‌ వేళ హింసాత్మక ఘటనలపై సిట్‌ తుది నివేదిక

ఎన్నికల వేళ ఏపీలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రం సెక్షన్లే పెట్టి సరిపెట్టారని, ఈవీఎంను ధ్వంసం చేసింది ఎవరో తెలిసినా గుర్తుతెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు చేశారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ తేల్చిచెప్పింది.

Published : 11 Jun 2024 09:29 IST

ఎన్నికల వేళ ఏపీలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రం సెక్షన్లే పెట్టి సరిపెట్టారని, ఈవీఎంను ధ్వంసం చేసింది ఎవరో తెలిసినా గుర్తుతెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు చేశారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ తేల్చిచెప్పింది. హింసాత్మక ఘటనల్లో కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోందని సిట్ తన తుది నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 264 పేజీలు, రెండు వాల్యూమ్‌లతో కూడిన నివేదికను సిట్ సమర్పించింది.  హింసాత్మక ఘటనల్లో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిన అంశాలతో పాటు తదుపరి చేయాల్సిన దర్యాప్తుపైనా సిఫార్సులు చేసింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు