AP Poll violence: హింసాత్మక ఘటనలపై దర్యాప్తులో ఏపీ పోలీసుల పక్షపాతం!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజున, ఆ తర్వాత పెద్దఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. పలుచోట్ల తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌ దర్యాప్తులో ఇలాంటి అంశాలన్నీ వెలుగుచూశాయి.

Published : 21 May 2024 09:29 IST

వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. ఊళ్లలో దళితులపై దమనకాండకు పాల్పడితే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజున, ఆ తర్వాత పెద్దఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. పలుచోట్ల తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌ దర్యాప్తులో ఇలాంటి అంశాలన్నీ వెలుగుచూశాయి.

Tags :

మరిన్ని