YS Jagan: సీఎంపై దాడి కేసులో సాక్షుల స్టేట్‌మెంట్లలో చిత్రవిచిత్రాలు

ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. ఎక్కడైనా వీఆర్వో వద్దకు వెళ్లి సమాచారం పంచుకోవడం చూశామా?

Published : 20 Apr 2024 11:35 IST

ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా పోలీస్ స్టేషన్‌కి కాకుండా వీఆర్వో వద్దకు వెళ్లి ఆ వివరాలు పంచుకోవడం చూశామా? అక్కడ ఆ వ్యక్తి స్టేట్‌మెంట్‌ను వీఆర్వో నమోదు చేసి దానిపై పోలీసులకు సమాచారం ఇవ్వడం విడ్డూరంగా లేదూ? పరిపాలన కేంద్రమైన విజయవాడలో అదీ పోలీస్ స్టేషన్‌కు 1.5కి.మీ. దూరంలో ఉండే వ్యక్తి ఇలా చేశారంటే నమ్మశక్యంగా ఉందా? విజయవాడ పోలీసులు దీనిని నిజం చేసి చూపించారు. గులకరాయి కేసులో నగర పోలీసులు కోర్టుకు సమర్పించిన కేస్ డైరీ రెండో భాగంలోని ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే అదేంటో ఇట్టే అర్థమవుతోంది.

Tags :

మరిన్ని