Sumalatha: భాజపాలోకి సీనియర్‌ నటి సుమలత..!

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Election) వేళ మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత (Sumalatha) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు. భాజపాలో చేరాలని నేను నిర్ణయించుకున్నా’’ అని తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో సుమలత వెల్లడించారు. 

Published : 03 Apr 2024 20:03 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు