AP News: సీఎం జగన్‌పై దాడి కేసులో.. తెదేపా హస్తం ఉంటే చెప్పాలని ఒత్తిడి చేశారు: దుర్గారావు

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో అనుమానితుడుగా భావిస్తున్న దుర్గారావును పోలీసులు ఎట్టకేలకు విడిచిపెట్టారు.

Published : 21 Apr 2024 09:39 IST

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో అనుమానితుడుగా భావిస్తున్న దుర్గారావును పోలీసులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. నాలుగు రోజులపాటు పోలీసుల అదుపులో ఉన్న దుర్గారావు విచారణ వివరాలను ఈటీవీతో పంచుకున్నారు. సీఎంపై రాయిదాడి ఎందుకు చేయించావని పోలీసులు తనను నిలదీసినట్లు దుర్గారావు చెప్పారు. దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు గట్టిగా చెప్పినట్లు వెల్లడించారు. తెలుగుదేశం నేతల హస్తం ఉంటే చెప్పాలని ఒత్తిడి చేసినట్లు తెలిపారు.

Tags :

మరిన్ని