ఫోన్ ట్యాపింగ్‌ కేసులో.. టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్ట్‌

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌ ఠాణాకు వచ్చిన ఆయన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని దర్యాప్తు బృందం రాత్రి వరకు విచారించింది. అనంతరం అరెస్ట్‌ చేసింది. శుక్రవారం ఉదయం ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

Updated : 29 Mar 2024 11:26 IST
Tags :

మరిన్ని